7.2 What Do You Do if You Visit Hyderabad? హైదరబాద్ వెళ్తే

Planning a Visit
Speaking Activity 1
Please take a good look at the picture above and record yourself describing this location.
Sentence Structure
In this part, Ravi describes his plans to visit Hyderabad by using positive conditional tense.
For example:
నేను హైదరబాద్ వెళ్తే, చార్ మినార్ చూస్తాను. (If I go to Hyderabad, I will visit Char Minar.)
Structure:
Subject + object + verb base + తే “te” (positive conditional marker) + subject suffix.
Please note that this particular grammar can be used only for future activities.
Vocabulary Practice
Pre-Reading Activities
Please read the following words, then write their meaning in English. After that, please respond to the prompts.
| No. | Telugu | English | Do You Have This in Your Town/City? | How Many |
|---|---|---|---|---|
| 1. | విశ్వవిద్యాలయాలు/యూనివర్సిటీలు | universities | అవును, వున్నాయి. | 5 |
| 2. | మ్యూజియంలు | museums | ||
| 3. | కోటలు? | forts | ||
| 4. | ఆస్పత్రులు | hospitals | ||
| 5. | తపాలా ఆఫీసులు | postal offices | ||
| 6. | గ్రంథాలయాలు/ లైబ్రరీలు | libraries | ||
| 7. | నదులు | rivers | ||
| 8. | వంతెనలు | bridges | ||
| 9. | పుస్తకాల దుకాణాలు | book stores | ||
| 10. | కొండలు | hills | ||
| 11. | గుళ్ళు , చర్చిలు | temples, churches | ||
| 12. | సూఫీ దర్గాలు | Sufi shrines |
Reading Activity
Context: Siri calls his friend Sneha to discuss travel plans and places to visit In Sneha’s hometown, Hyderabad.
| Name | Telugu | English |
|---|---|---|
| సిరి: | హే, స్నేహా, ఎలా వున్నావు? నువ్వు హైదరాబాద్ లో వుంటున్నావు కదా? | Hey, Sneha, How are you? You’re in Hyderabad, right?! |
| స్నేహ: | అవును, సిరీ! నేను హైదరబాద్ లో వుంటున్నాను. | Yes, I’m in Hyderabad. |
| సిరి: | ఎండాకాలం నేను అక్కడికి వస్తాను. అక్కడికి వస్తే, ఏమేం చేయవచ్చు? | I’ll be there this summer. What can I do if I visit there? |
| స్నేహ: | ఓహ్! ఇక్కడికి వస్తే, చాలా చాలా వున్నాయి. | Oh, if you come here, there are many things. |
| సిరి: | ఎండాకాలం అయితే, ఏ నెలలో వస్తే బాగుంటుంది? | If it’s summer, when would be the best time to visit? |
| స్నేహ: | జూన్ లో వస్తే బాగుంటుంది. ఇక్కడికి వస్తే ముఖ్యంగా నువ్వు ఏం చేస్తావు? | It’s better if you come in June. If you come, what will you do mainly? |
| సిరి: | హైదరబాద్ వస్తే, నేను ఒక ఆస్పత్రిలో డాక్టర్ దగ్గిర పనిచేస్తాను. | If I visit Hyderabad, I will work in a hospital with a doctor. |
| స్నేహ: | బాగుంది. మా ఇంట్లో వుంటే ఇక్కడికి దగ్గిర ఆస్పత్రులు వున్నాయి. | Good. If you stay at our house, there are hospitals nearby. |
| సిరి: | బ్రహ్మాండం! అయితే, నేను మీ ఇంట్లో వుంటాను. | Fantastic! If that’s the case, I will stay at your house. |
| స్నేహ: | ఇక్కడ వుంటే అన్నీ దగ్గిరగా వుంటాయి. గ్రంథాలయాలు, మ్యూజియంలూ, సినిమా హాళ్లూ- అన్నీ. | If you’re here, everything is nearby—libraries, museums, cinema—everything. |
| సిరి: | బాగుంది. మీ ఇంట్లో వుంటే, అక్కడ మీ అమ్మానాన్నకి పరవాలేదా? | That’s good. Is it okay with your parents if I stay at your house? |
| స్నేహ: | అవునవును. నువ్వు వస్తే, వాళ్ళు సంతోషిస్తారు. | Yes, yes! They will be happy if you’re here. |
| సిరి: | నేను రెండు నెలలు వుంటే, అక్కడ ఏమేం చూపిస్తావు? | If I’m going to be there for two months, what places can you show me? |
| స్నేహ: | సరిగా ప్లాన్ చేస్తే, గోల్కొండ కోట, చార్ మినార్, మక్కా మసీదు, సికిందరాబాద్ చర్చ్ లు, టాంక్ బండ్, సినిమా హాళ్ళు, సూఫీ దర్గాలు- ఇంకా చాలా చాలా. హైదరబాద్ వస్తే, మనం వేరే చోట్లకి కూడా వెళ్తాం. | If we plan properly, Golconda fort, Char Minar, Mecca Mosque, Secunderabad churches, Tank Bund, Cinema Halls, Sufi Shrines—and more and more. If you come here, we will also go to other places. |
| సిరి: | ఓహ్! సంతోషం. నేను విమానం టికెట్ కొంటే, నీకు చెప్తాను. | Oh, I’m glad! I will let you know when I book my flight. |
| స్నేహ | తప్పకుండా! నీకు వీలుంటే, మూడు నెలలు ప్లాన్ చెయ్యి. | Definitely! If possible, plan for three months. |
| సిరి: | సరే | Right. |
| స్నేహ | నీ కోసం ఎదురుచూస్తాను. | I look forward to seeing you. |
Writing Activities
- Please write 10-15 sentences describing your plans to visit a friend’s city.
- Based on above conversation, please write 10 sentences in Telugu describing Hyderabad.
Imagine that you are Siri. You are planning to ask Sneha at least 10 questions about Hyderabad and other places to visit. Please make a list of your questions. In this case, you don’t need to stick to positive conditional; you can play around with different structures.
| No. | హైదరబాద్ గురించి ప్రశ్నలు (Questions About Patna) |
|---|---|
| 1. | |
| 2. | |
| 3. | |
| 4. | |
| 5. | |
| 6. | |
| 7. | |
| 8. | |
| 9. | |
| 10. |
Speaking Activity 2
After gathering information either from someone you know from Hyderabad or from the Internet, please write 10-15 sentences about Hyderabad, then record yourself describing the city.