7.6 Speaking About Music and Songs సంగీతమూ/పాటలు

People sitting watching a music performance
A classical Telugu musical instrument concert వీణ కచేరీ. Photo: Jaya Surya Somanchi, licensed under CC BY-NC

Music and Songs

Writing Activity

Please write 10 sentences in Telugu about your favorite music and songs.

Speaking Activity 1

Please record yourself describing that music and/or those songs.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

Reading Activity

తెలుగు సంస్కృతిలో సంగీతం చాలా ముఖ్యమైన భాగం. నేను చిన్నప్పటి నుంచీ సంగీతం వింటున్నాను. మా ఇంట్లో అందరికీ సంగీతం అంటే ఇష్టం.

రెండు రకాల సంగీతం నాకు తెలుసు. ఒకటి: వాయిద్యాలు- అంటే వీణ, వయొలిన్, తబలా. మా అమ్మమ్మ వీణ బాగా వాయిస్తుంది. ఆవిడ చిన్నప్పుడే వీణ నేర్చుకుంది.

అమ్మ వాయిద్యాలు నేర్చుకోలేదు. కానీ, బాగా పాడుతుంది. గొంతుతో పాడే పద్ధతిని గాత్రం అంటారు. నా స్నేహితులలో కొంతమంది గాత్రం నేర్చుకున్నారు. వీళ్ళు భజన పాటలూ, కీర్తనలూ బాగా పాడతారు.

ఎక్కువ మందికి తబలా, వయొలిన్ అంటే ఇష్టం. కొంతమంది గిటార్ మీద మన సంగీతం వినిపిస్తారు. అది కూడా బాగుంటుంది.

ఇవి కాకుండా, తెలుగు సంస్కృతిలో రకరకాల పాటలు వున్నాయి. మా ఇంట్లో టీవీలో పొద్దున భక్తి పాటలు పెడతారు. కొన్ని పాటలు రాముడి గురించి, శివుడి గురించీ వుంటాయి. సూఫీ పాటలు కూడా అప్పుడప్పుడూ పెడతారు.

ఇక సినిమా పాటల సంగతి చెప్పక్కర్లేదు. నా స్నేహితులు చాలా మందికి ఇప్పటి సినిమాల పాటలు వినడం అలవాటు. spotify లాంటి చోట అలాంటి పాటలు పెట్టుకొని, వింటారు.

మా యూనివర్సిటీలో భారతీయ సంగీతం కోసం కొన్ని క్లబ్బులు వున్నాయి. ఈ క్లబ్బులలో తెలుగు వాళ్ళు కూడా చాలా మంది వున్నారు. వాళ్ళు కీర్తనలూ, తెలుగు సినిమా పాటలు పాడతారు. కొంతమంది అమెరికన్ సంగీతమూ, తెలుగు పాటలూ కలిపి పాడతారు.

నేను స్కూల్ లో వున్నప్పుడు పియానో నేర్చుకున్నాను. కానీ, తరవాత మానేశాను. వయొలిన్ నేర్చుకోవాలని అనుకున్నాను. వచ్చే ఎండాకాలం మొదలు పెడతాను.

Speaking Activity 2

Please record yourself interviewing a classmate, friend, or family member about their interest in Telugu music and songs.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.