7.5 Festival of Lights దీపావళి

Bright colored intricate design on the floor, each corner and side of this rectangle of design has a candle

Telugu Festivals

Pre-reading Vocabulary Activity

Pre-reading Speaking Activity

Please talk to a friend or family member or conduct a little research to learn about the festival of Deepavali. Record yourself describing the festival in 10 sentences.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

Reading Activity

దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. దీపం మనకు తెలిసిన పదం! కానీ, ఆవళి అంటే సంస్కృతంలో వరస. ఇండ్ల ముందు వరసగా దీపాలు పెడతారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇంటి నిండా, ఊరి నిండా దీపాలు వెలిగించి, వెలుగుకి స్వాగతం చెప్పే పండగ. మన తెలుగు కుటుంబాలు ఈ పండగని చాలా సందడిగా జరుపుకుంటారు. అయితే, ఇది కేవలం మన తెలుగు పండగ కాదు. భారతీయుల పండగ.

అందుకే, అమెరికాలో కూడా భారతీయులు ఎక్కువగా వున్న చోట్ల ఈ పండగని బాగా చేస్తారు. హిందూ దేవాలయాలలో దీపాలు అలంకరించి, ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అమెరికాలో భారతీయులు ఎక్కువగా వున్న యూనివర్సిటీ క్యాంపస్ లలో కూడా ఇప్పుడు ఈ పండగని బాగా జరుపుకుంటున్నారు.

దీపావళి పండగ పుట్టుక గురించి పురాణాల్లో రకరకాల కథలు వున్నాయి. రామాయణంలో కథ ప్రకారం- రావణాసురుడిని చంపిన తరువాత రాముడు అయోధ్యకు సీతతో కలిసి తిరిగి వస్తాడు. అప్పుడు అయోధ్యలో ప్రజలంగా దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. దీన్నే దీపావళిగా అప్పటి నుంచి గుర్తించి పండగను చేసుకుంటున్నారని ఆ కథ చెబుతుంది.

ఇంకో కథ కూడా బాగా ప్రచారంలో వుంది. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలను, ప్రజలను బాగా హింసించేవాడు. అయితే, అతనికి బ్రహ్మ దేవుడి నుంచి ఒక వారం వుంది. ఆ వరం ప్రకారం పురుషుడి చేతిలో అతనికి మరణం లేదు. అతను శ్రీకృష్ణుడితో యుద్ధం చేసినప్పుడు, కృష్ణుడి భార్య సత్యభామ అతన్ని చంపుతుంది. ఆ రాక్షసుడి మరణం వల్ల అందరూ అతని హింస నుంచి విముక్తి అవుతారు. అందువల్ల, దీపావళి పండగ చేసుకున్నారని ఆ కథ చెబుతుంది.

దీపావళి రోజు మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. దీంతో చుట్టూ ప్రాంతం మొత్తం వెలుగులతో నిండిపోతుంది. పండగ సాయంత్రం మహాలక్ష్మికి పూజలు చేస్తారు. ఇంట్లో పిండి వంటలు, మిఠాయి చేస్తారు. ఇంటిని శుభ్రం చేసుకొని పూలతో, దీపాలతో అలంకరిస్తారు. ఇది అందరూ కలిసి చేసుకునే పండగ.

Post-reading Activity

Please write 10 sentences about any of your favorite Telugu festivals using the new vocabulary.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.