7.4 Visiting a Historical Site

Planning the Visit

Listening Activity

Please listen to this video and note down key aspects of the city of Amaravathi, the capital of Andhra Pradesh.

అమరావతి వైభవం | Aadhan Special Story on Amaravati | Andhra Pradesh Capital | AP News | Aadhan

Pre-reading Activity

Reading Activity

Formal Conversation

Context: A professor is conducting a field trip for Ravi to various places around Amaravati in the Andhra Pradesh.

Name Telugu English
ప్రొఫెసర్: రవీ, ఈ శనివారం మనం అమరావతి వెళ్దాం. Ravi, Let’s go to Amaravathi this Saturday.
రవి:  చాలా సంతోషం. నేను అమరావతి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. That makes me so happy. I’ve been thinking of visiting Amaravathi for a long time.
ప్రొఫెసర్: అవునా?! మంచిది.  Really?! That’s good.
రవి:  ప్రొఫెసర్, అమరావతి మనకు ఎందుకు ముఖ్యం? Professor, why is Amaravathi so important?
ప్రొఫెసర్: అమరావతి ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని. Amaravathi is the capital of Andhra Pradesh.
రవి:  అక్కడ మనం ఏమేం చూడవచ్చు? What places could we visit there?
ప్రొఫెసర్: చాలా వున్నాయి. మొదట అది ఒక బౌద్ధ క్షేత్రం. ఇప్పుడు రాజధానిగా మారిన తరవాత చాలా కొత్త ప్రదేశాలు చూడవచ్చు. There are many. First of all, it was a Buddhist site. Now, after it became the capital, there are many places to see.
రవి:  అమరావతి పేరు కూడా ఆసక్తిగా వుంది. ఆ పేరు ఎందుకు వచ్చింది? The name—Amaravathi—is also interesting. How did the city get that name?
ప్రొఫెసర్: అమరావతి అంటే మృతి లేని వాళ్ళ నగరం అని అర్థం. ఇక్కడ అమర లింగేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. అందువల్ల, ఆ పేరు వచ్చింది. Amaravathi means the city of immortals. Amara Lingeswara Swamy temple is famous there. That’s why the name.
రవి:  కృష్ణా నదికి ఈ నగరం ఎంత దూరం, ప్రొఫెసర్? How far is the city to the Krishna River, professor?
ప్రొఫెసర్: కృష్ణా నది ఒడ్డున ఈ నగరం వుంది. This city is on the banks of the Krishna River.
రవి:  ఇంతకుముందు కూడా ఇది తెలుగు వాళ్ళ రాజధాని అని విన్నాను. I heard it was also the capital of the Telugus.
ప్రొఫెసర్: అవును. రెండు వేల ఏళ్ల కిందట శాతవాహనులు తెలుగు రాజులు. వాళ్ళ రాజధాని ఇది.  Yes, some 2000 years back it was the capital of the Telugu kings called Sathavahanas.
రవి:  శాతవాహనులు పెద్ద రాజులా? Were Sathavahanas important kings?
ప్రొఫెసర్: అది పెద్ద రాజవంశం. ఆ కాలంలో వాళ్ళు ఆంధ్ర, తెలంగాణ తో పాటు కొన్ని సరిహద్దు ప్రదేశాలను కూడా పాలించారు. It was a major dynasty. In those days, they ruled Andhra, Telangana, and some border places too.
రవి:  అయితే అక్కడికి మనం తప్పకుండా వెళ్ళాలి, ప్రొఫెసర్ Then, Professor, we should definitely go there.
ప్రొఫెసర్: ఈ వీకెండ్ వెళ్దాం, రవీ! Ravi, let’s go this weekend.

Writing Activity

Please write 10 sentences describing your own state or provincial capital.

Speaking Activity

Please record yourself describing that capital.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.