7.3 If You’re Not Going Anywhere This Summer
Working with Negative Conditionals
Structure:
Infinitive verb + అకపోతే (negative conditional marker).
- హైదరబాద్ వెళ్లకపోతే, ఇక్కడ కాంపస్ లో క్లాసులు తీసుకుంటాను. (If I don’t go to Hyderabad, I will take classes here on the campus.)
- ఇవాళ సాయంత్రం రమేష్ కలవకపోతే, నేను రేపు ఫోన్ చేస్తాను. (If Ramesh does not meet me this evening, I will call him tomorrow.)
Writing Activity
Following this structure, please write 10 sentences using negative conditionals.
| Negative Conditionals | Sentences |
|---|---|
| తినకపోతే | ఇవాళ రాత్రి నేను అన్నం తినకపోతే, టిఫిన్ చేస్తాను. |
| రాయకపోతే | |
| వెళ్లకపోతే | |
| చదవకపోతే | |
| కలవకపోతే | |
| మాట్లాడకపోతే | |
| తాగకపోతే | |
| రాకపోతే | |
| కొనకపోతే | |
| చెప్పకపోతే |
Pre-reading Vocabulary Practice
| Telugu | English |
|---|---|
| ఉత్సాహం | enthusiasm/excitement |
| కుదురు | adjust/settle |
| దొరుకు | available |
| ఎత్తు (verb) | to lift Example: నేను ఫోన్ ఎత్తలేదు. (I didn’t lift the phone/ I didn’t take the call.) |
Reading Activity
Context: Due to an unexpected new assignment, Ravi had to change his plans this summer and he’s talking about alternative plans with Srini, his friend.
| Name | Telugu | English |
|---|---|---|
| రవి: | హే, శ్రీని! ఎలా వున్నావు? | Hey, Srini, How are you? |
| శ్రీని: | పరవా లేదు, రా! నువ్వు?! | Not bad, buddy! You?! |
| రవి: | అంత ఉత్సాహంగా లేను. | Not so great. |
| శ్రీని:: | ఎందుకు? | Why? |
| రవి: | ఈ ఎండాకాలం హైదరబాద్ వెళ్లాలని అనుకున్నాను. అది కుదరడం లేదు. | I thought of going to Hyderabad this summer. But it’s not working out. |
| శ్రీని: | మరి, హైదరబాద్ వెళ్లకపోతే ఏం చేస్తావు? | If you don’t go to Hyderabad, what will you do then? |
| రవి: | ఇక్కడే వుంటాను. కాంపస్ లో ఒక కొత్త పని దొరికింది. నువ్వేం చేస్తున్నావు? | I’ll be here. I got a new job on campus. What are you be doing? |
| శ్రీని: | నేను కూడా కాంపస్ లో పనిచేస్తాను. కానీ, సెలవు దొరికితే ఒక వారం హైదరబాద్ వెళ్తాను. | I will also work on campus. But if I get a break, I will go to Hyderabad. |
| రవి: | బాగుంది. సెలవు దొరకకపోతే.….? | Good. If you don’t get the break….? |
| శ్రీని: | ఏం చేస్తాను?! ఇక్కడే వుంటాను. పనిలేకపోతే బాగుంటుంది అనుకున్నాను. | What would I do? I would stay right here. I thought it would be better if there’s no work. |
| రవి: | నిజమే. కొన్ని సార్లు అలా కుదరదు. కుదరకపోతే ఏం చేస్తాం?! | True. Sometimes it doesn’t work out. What should we do if it’s not working out?! |
| శ్రీని: | సరే. ఇవాళ రాత్రి నువ్వు వంట చేయకపోతే, మనం బయటికి వెళ్ళి, తిందాం. | Okay. If you’re not cooking tonight, let’s go out and eat. |
| రవి: | తప్పకుండా. నేను ఒక గంటలో నీకు ఫోన్ చేస్తాను. | Definitely. I will call you in an hour. |
| శ్రీని: | సరే. నేను ఫోన్ ఎత్తకపోతే, మెసేజ్ పెట్టు. | Okay. If I don’t pick up the phone (take the call), please leave a message. |
| రవి: | శ్రీకర్ కి కూడా చెప్పు. | Also, let Srikar know. |
| శ్రీని: | చెప్తాను. వాడు లైబ్రరీకి వెళ్తానని చెప్పాడు. వెళ్లకపోతే వస్తాడు. | I will tell him. He said he will be going to library. If he’s not going there, he will come. |
| రవి: | సరే | Okay. |
| శ్రీని: | నీ మెసేజ్ కోసం ఎదురుచూస్తాను. | I look forward to your message. |
Speaking Activity
Please record a conversation with a classmate or friend using negative conditionals.