7.1 Describing Ravi’s Room రవి గది గురించి
Working with Informal Expressions
In this part, we talk about Ravi’s room and learn the related vocabulary and conversations. Since we already learned about formal expressions, this conversation focuses on informal expressions.
Pre-reading Activity
Reading Activity
Informal Conversation
Context: Ravi’s friend Sreedhar is visiting him, and Ravi provides a description of his room.
| Name | Telugu | English |
|---|---|---|
| (N/A) | తలుపు దగ్గిర గంట మోగుతుంది. రవి తలుపు తీస్తాడు. | The doorbell rings and Ravi opens the door. |
| రవి: | హే, శ్రీధర్! ఎలా వున్నావు? | Hey, Sridhar. How are you? |
| శ్రీధర్: | హే, నేను బాగున్నాను. నువ్వు?! | Hello, I’m well. You? |
| రవి: | బాగున్నాను. రా , లోపలికి రా. | I am okay too. Come, come inside. |
| శ్రీధర్: | థాంక్స్ రా! మీ ఇల్లు చక్కగా వుంది. | Thanks, your home is very beautiful. |
| రవి: | ఓహ్! థాంక్స్ రా ! పద, నా గదిలోకి వెళ్దాం. | Thanks. Let’s go. We’ll go to my room. |
| శ్రీధర్: | అలాగే! పద. | Okay, let’s go. |
| రవి: | ఇదేరా నా గది! చిన్న గది. ఇదిగో, ఈ కుర్చీలో కూర్చో. | Here’s my room. It’s a small room. Here you go, sit here in this chair. |
| శ్రీధర్: | గది బాగుంది రా! బాగా సర్ది పెట్టుకున్నావు. | Your room is nice. You arranged it well. |
| రవి: | అన్నీ వున్నాయి. మేజా బల్ల, బట్టల అల్మరా, టాయిలెట్, స్నానాల గది. | It has everything: table, wardrobe, toilet, shower. |
| శ్రీధర్: | అవును, అంతా సౌకర్యంగా వుంది. | Yes, it’s comfortable. |
| రవి: | పుస్తకాలు మాత్రం కింద స్టడీ రూమ్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు చదివే పుస్తకాలు మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను. | I just put a book in the downstairs study room. Here I only keep the books that I’m reading now. |
| శ్రీధర్: | పర్లేదు. పడక గదిలో పుస్తకాలు ఎందుకు?! | Okay. Why do you need books in the bedroom? |
| రవి: | హహ! సోఫా మీద కొన్ని పుస్తకాలు వున్నాయి. | Haha! There are a few on the sofa. |
| శ్రీధర్: | ఈ గదిలో టీవీ లేదు. నాకు హాయిగా అనిపిస్తోంది. | This room has no TV. That’s very pleasant. |
| రవి: | నిజమే! | It’s true. |
| శ్రీధర్: | బాగుందిరా! | Good! |
Writing Activity 1
Please make a list of at least 10 characteristics of Ravi’s room and then 10 of your room.
Writing Activity 2
Please write a 10-15 sentence description of your own room.
Speaking Activity
Please record yourself describing the room.