6.5 Talking to a Friend About the Trip ప్రయాణం గురించి స్నేహితుడితో సంభాషణ

Describing Your Trip

Pre-reading Activity

Please write down your possible itinerary in Hyderabad. Also, write down what exactly you want to do in Hyderabad.

Reading Activity

Context: For the first time, Ravi is planning a travel to Hyderabad from Philadelphia on his own. He is on a Zoom call with one of his friends, Mahy, in Hyderabad.

Name Telugu English
రవి: హే, మాహీ! ఎలా వున్నావు, రా?! Hey, Mahi, How are you, buddy?
మాహి: బాగున్నాను, రా! ఏమిటి సంగతులు? I am well. What’s up?
రవి: ఈ డిసెంబర్ సెలవులలో నేను హైదరబాద్ వస్తున్నాను. నువ్వు అక్కడే వుంటావా? I am visiting Hyderabad during the holidays in December. Are you going to be there?
మాహి:  అవును, వుంటాను. రా! నేను ఎయిర్ పోర్టుకి వస్తాను. నీ విమానం ఎన్ని గంటలకు? Yes, I will be here! Please do come! I will come to the airport. What time your flight will arrive?
రవి: అర్థరాత్రి రెండు గంటలు అవుతుంది. నీకు మరీ ఆలస్యం కదా?! It’s going to be midnight. Isn’t that too late for you?
మాహి:  ఏమీ పర్లేదు. నువ్వు రా! మా ఇంటి నుంచి ఎయిర్ పోర్టుకి కారులో రెండు గంటలు. నేను వస్తాను. That’s totally fine. You just come! It’s a two hour car drive from our house to the airport.
రవి: ఓహ్! థాంక్స్, రా! హైదరబాద్ నుంచి విజయవాడ ఎంత సేపు ప్రయాణం? Oh! Thanks, buddy! How much time does it take from Hyderabad to Vijayawada?
మాహి: రెండు గంటలు. ఇప్పుడు విమానంలో వెళ్లవచ్చు. చాలా తేలిక! Two hours. Now you can take the flight. Very easy!
రవి:  సరే. నేను హైదరబాద్ లో ఒక రోజు వుండి, విజయవాడ వెళ్తాను. Alright. I will stay one day in Hyderabad and then go to Vijayawada.
మాహి: తప్పకుండా! ముందు నువ్వు రా! వచ్చిన తరవాత మనం ఆలోచిద్దాం. మీ ఊరు నించి హైదరబాద్ కి ఎన్ని గంటలు ప్రయాణం? Definitely! First you come here! We will plan once you’re here. How long is the travel from your place to Hyderabad?
రవి: దాదాపు 24 గంటలు. మధ్యలో రెండు గంటలు Frankfurt లో ఆగుతుంది. Almost 24 hours. In between there’s a two hour stop in Frankfurt.
మాహి: అవునా?! అయితే, నువ్వు కనీసం ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలి. Really?! If so, you should take at least one day to rest.
రవి: సరే! నీకు వీలుంటే ఇద్దరం కలిసి వెళ్దాం. Yes! If it’s possible, we should go together.
మాహి: విజయవాడ నేను కూడా వస్తాను. కారులో కూడా వెళ్లవచ్చు. కారులో కూడా ఇప్పుడు అయిదారు గంటలు. I will also travel with you to Vijayawada. We might go by car. Even by car it’s five or six hours.
రవి: బాగుంది, సంతోషం! That’s okay. So happy!

Writing Activity

Context: Your friend is not available for a Zoom call and you decided to write a letter to them in Telugu. Please write 10 sentences in Telugu.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.