6.3 Rescheduling an Event/Meeting

Working to Reschedule

In this part, we learn about rescheduling an event or an individual meeting.

Vocabulary Practice

Speaking Activity 1

Please record the following conversation with a friend.

విశాల్: హెలో, సుధీర్, ఎలా వున్నావు?

సుధీర్ : నేను బాగున్నాను, రా! నువ్వు?!

విశాల్: నేనూ బాగున్నాను రా! ఏమిటి కబుర్లు?

సుధీర్: ఈ వీకెండ్ మన మీటింగ్ వాయిదా వేద్దామా?

విశాల్: అలాగే, ఎందుకు?

సుధీర్: అమ్మానాన్న న్యూజెర్సీ నుంచి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళతో కలిసి, నేను బయటికి వెళ్ళాలి.

విశాల్ : సరే, మరి, ఎప్పుడు కలుద్దాం?

సుధీర్: వచ్చే వీకెండ్ కలుద్దాం. మన తెలుగు క్లబ్ సభ్యులకు (మెంబర్స్ ) కి కూడా చెప్పు.

విశాల్: ఇవాళ శ్యామ్ కలుస్తాడు. వాడికి చెప్తాను. మిగిలిన వాళ్ళకి మెసేజులు పెడతాను.

సుధీర్: దూరం నుంచి వచ్చే వాళ్ళకి నేను ముందే చెప్తాను. ఇప్పుడు వాళ్ళందరికీ మెసేజులు రాస్తాను.

విశాల్: వచ్చే వీకెండ్ అసలు సమయం కూడా చెప్పు.

సుధీర్: శనివారం పొద్దున పది గంటలకు కలుద్దాం. ఆ రోజు మధ్యాన్నం మనం కలిసి, లంచ్ కి వెళ్లవచ్చు. గతంలో కూడా అలా కలిసి లంచ్ తినేవాళ్లం కదా!

విశాల్: అవును, బాగుంటుంది.

సుధీర్: మన తెలుగు క్లబ్ భవిష్యత్తు ఎజెండా కూడా రాద్దామా?

విశాల్: తప్పకుండా!

సుధీర్: సరే, ఎదురుచూస్తుంటా.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.