5.4 Habitual Activities

Since the grammar paradigms for future tense and habitual look the same, we need to be clear about using such sentences.

For instance:

నేను వీకెండ్ సినిమాకి వెళ్తాను.

This might imply that you go to a movie every weekend. To avoid such confusion, it’s better to specify the time.

నేను వీకెండ్ సినిమాకి వెళ్తాను.

Please note the in bold, which specifies that this activity is about this weekend.

Pre-reading Activity

Please learn the following vocabulary.

Telugu English Telugu English
పొద్దున n.f. morning పావు adj. 1:15 AM/PM
మధ్యాన్నం n.f. afternoon ఒంటి గంట adj. 1:00 AM/PM
సాయంత్రం n.f. evening రెండున్నర adj. 2:30 AM/PM
రాత్రి n.f. night రెండుంబావు phrase 2:15 AM/PM
పగలు n.m. day మూడు గంటలు phrase 3:00 AM/PM
ఆదివారం n.m. Sunday మూడుంబావు phrase 3:45 AM/PM
సోమవారం n.m. Monday xకి ముందు pp. before X
మంగళవారం n.m. Tuesday x తరవాతpp. after X
బుధవారం n.m. Wednesday వారం n.m. week
గురువారం n.m. Thursday వారాంతం, శనాదివారాలు n.f. weekend/Saturday and Sundays
శుక్రవారం n.m. Friday నెల n.m. month
శనివారం n.m. Saturday ఏడు/సంవత్సరం n.f. year
గంట n.m. o’clock ఎన్ని గంటలకు? phrase At what time?
మూడు గంటలు phrase It is 3 o’clock. మీరు/నువ్వు X గంటలకు ఏం చేస్తారు? చేస్తావు? phrase What do you do at X o’clock?

Reading

దినచర్య (Formal)

Context: Ravi and Siri are sharing their daily schedule and what they’re doing right now in the present.

Name Telugu English
రవి: నమస్కారం, సిరి! మీరేం చేస్తున్నారు? Hello Siri, what are you doing?
సిరి: నమస్కారం, రవి. ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. మామూలుగా, నేను సాయంత్రం మూడు గంటలకు చదువుకుంటాను. మీరేం చేస్తున్నారు? Hello Ravi, I am studying right now. Generally, I study at 3 o’clock in the evening. What are you doing?
రవి: ఇప్పుడు నేను లైబ్రరీకి వెళ్తున్నాను. మీరు పొద్దున ఎన్ని గంటలకు నిద్రలేస్తారు? I am going to library. When do you get up in the morning?
సిరి: నేను ప్రతి రోజూ అయిదు గంటలకు నిద్రలేస్తాను. మీరు?! I get up at 5 o’clock in the morning every day. And you?
రవి: నేను ఆరు గంటలకు లేస్తాను. మీరు టిఫిన్ ఎప్పుడు తింటారు?  I get up at 6 o’clock. When do you eat breakfast?
సిరి: లేచాక నేను కొంచెం సేపు యోగా చేస్తాను. యోగా తరవాత స్నానం చేస్తాను. ఏడున్నర ప్రాంతంలో టిఫిన్ తింటారు. మీరు టిఫిన్ ఎప్పుడు చేస్తారు? After waking up, I do yoga for a while. After yoga, I bathe, after that at around 7:30, I eat breakfast. When do you eat breakfast?
రవి: ఎనిమిది లేకపోతే ఎనిమిదింబావుకి టిఫిన్ తింటార్ను. సాయంత్రం నాలుగు గంటలకు మీరేం చేస్తారు? I eat breakfast at 8:00 or 8:15. What do you do at 4 o’clock in the evening?
సిరి: మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా చదువుకుంటాను. మీరు?! I study from 3 to 6 o’clock. And you?
రవి:  మూడు గంటల నుంచి నాలుగు దాకా పరిగెత్తుతాను. ఆ తరవాత కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు? I do jogging from 3 to 4 o’clock. After that I rest a little. What time do you go to sleep?
సిరి: దగ్గిర దగ్గిర పది గంటల సమయంలో పడుకుంటాను. మీరు?! I go to sleep at around 10 o’clock. And you?
రవి: నేను దాదాపు పదకొండు గంటల సమయంలో పడుకుంటాను. ఈ శనాదివారాలు మీరు తీరికగా వుంటారా? I go to sleep at around 11 o’clock. Are you free this Saturday or Sunday evening?
సిరి: మామూలుగా వీకెండ్ తీరికగానే వుంటాను. ఎందుకు, ఏమిటీ సంగతి? Yes. Generally, I am available on weekends. Why, what’s the matter?
రవి: నేను ఒక సినిమా చూడాలని అనుకుంటున్నాను. మీకు తీరిక వుంటే, మనం సినిమా చూడవచ్చు. I want to watch a film. If you are available we can watch a film.
సిరి: అవునా?! బ్రహ్మాండం! బాగుంది. మనం తెలుగు సినిమా చూద్దాం.  Really?! Great! Good. We will watch a Telugu film.
రవి: బాగుంది, సంతోషం! Good. I’m so glad!

Note: By changing the pronouns and the verbal endings to vu- you can do the same conversation in an informal mode. For instance:

  • Formal: మీరు ఏం చేస్తున్నారు?
  • Informal: నువ్వు ఏం చేస్తున్నావు?

Post-Reading Activities

Writing Activity

Based on the above reading, please complete the following table.

ఎప్పుడు? రవి  సిరి 
నిద్రలేస్తారు?
టిఫిన్ తింటారు?
పడుకుంటారు?

Speaking Activity

Please talk about daily routines with a classmate or friend (using terms from the pre-reading activity). Figure out where your routine matches with theirs.

Please record 10 sentences based on this conversation.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.