5.2 Reading Practice with Future Tense
Pre-reading Activity: Vocabulary Practice
For each of these words, please make three different sentences using three different subjects in future tense positive.
| Telugu Word with Meaning | Practice 1 | Practice 2 | Practice 3 |
|---|---|---|---|
| పుట్టిన రోజు (birthday) | |||
| యాభయ్ (50) | |||
| ఆలోచించు (to think) | |||
| జాబితా (list) | |||
| పాత (old) | |||
| పాట (song) | |||
| ఎప్పుడూ (always) | |||
| మేమిద్దరం (మేం + ఇద్దరం) (we both) | |||
| పెట్టు (to put) | |||
| చెల్లి/ చెల్లెలు (younger sister) | |||
| అంతగా (that much) | |||
| శాకాహారం (vegetarian) | |||
| మాంసాహారం (non-vegetarian) | |||
| ఇంకోసారి (another time) |
Reading Activity
వచ్చే నెల అమ్మ పుట్టిన రోజు. ఇది అమ్మ యాభయ్యో పుట్టిన రోజు. నేనూ, చెల్లీ ఈ పుట్టిన రోజుకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాం. అమ్మకి ఏమేం ఇష్టం అని ఒక జాబితా చేస్తున్నాం. అమ్మకి పాత తెలుగు సినిమా పాటలు ఇష్టం. ఎప్పుడూ ఆ పాటలే వింటుంది. వాటిలో కొన్ని నాకూ ఇష్టమే. మేమిద్దరం కొన్ని పాటలు కలిసి వింటాం. ఈమధ్య యూట్యూబ్ లో కూడా అవి చూస్తున్నాం. నేను అమ్మ కోసం కొన్ని పాటలు Spotify లో పెడ్తున్నాను.
కానీ, చెల్లికి పాత పాటలు అంతగా నచ్చవు. చెల్లి ఎక్కువగా కొత్త పాటలు వింటుంది. అందుకని, చెల్లి అమ్మ కోసం కొత్త బట్టలు కొనాలని అనుకుంటోంది. వచ్చే వారం మేం సెంటర్ సిటీ కి వెళ్ళి, షాపింగ్ చేస్తాం. అక్కడ ఇండియన్ బట్టలు వుండవు కానీ, ఇప్పుడు అమ్మ అమెరికన్ బట్టలే ఎక్కువగా వేసుకుంటోంది.
ఆ రోజు ఒక శాకాహార రెస్టారంట్ లో రాత్రి భోజనానికి బుక్ చేశాం. ఆ రెస్టారంట్ ఇండియాది కాదు. కానీ, చాలా శాకాహార పదార్థాలు అక్కడ దొరుకుతాయి.
వచ్చే ఎండాకాలం మేం హైదరబాద్ వెళ్తాం. అప్పుడు అక్కడ మా అమ్మమ్మా, తాతయ్యా, మామయ్యలతో కలసి, అమ్మ పుట్టిన రోజు ఇంకో సారి చేస్తాం.
Writing Activity
Using the above example, please write about any future event in your family in 10 sentences.