4.4 Reading Activity with Past and Present Tenses
Pre-Reading Activities
Discussion
In a group, please share the letter you wrote for the previous chapter using past and present tense. Please also share to whom you want to write a letter today, and what you want to write about.
Vocabulary Practice
| Telugu | English |
|---|---|
| ప్రియమైన adj. | dear |
| కుటుంబం n.f. | family |
| దగ్గిర locative | near |
| ఈమధ్య | recently |
| కానీ | but |
| రకరకాల | different types |
| కొంతమంది | some people |
| అప్పుడప్పుడూ | now and then |
| చుట్టాలు | relatives |
| కొనుక్కొను | to buy |
| తీరిక | leisure |
| అడుగు verb | to ask |
Reading
న్యూ జెర్సీ
మే 13, 2024
ప్రియమైన శ్రీధర్,
ఎలా వున్నావు? ఇప్పుడు మీ కుటుంబం హైదరబాద్ లో ఎక్కడ వుంటోంది? అక్కడికి దగ్గిరలో మన స్నేహితులు కూడా ఎవరైనా ఉంటున్నారా?
నేను ఈమధ్య హైదరబాద్ రాలేదు. చాలా కాలమైంది. వచ్చే ఎండాకాలం తప్పకుండా రావాలనుకుంటున్నాను. కానీ, ఇంకా ఏమీ తెలియదు.
ఇప్పుడు మేం న్యూజెర్సీలో వుంటున్నాం. ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు వున్నారు. వాళ్ళు రకరకాల కంపెనీల్లో పని చేస్తున్నారు. కొంతమంది డాక్టర్లుగా, కొంతమంది ఇంజినీర్లుగా, ఇంకా కొంతమంది బిజినెస్ లో, కొంతమంది సాఫ్ట్ వేర్ లో పనిచేస్తున్నారు.
నా స్నేహితులు చాలా మంది ఎండాకాలంలో న్యూయార్క్ లో పనిచేస్తున్నారు.
ఎండాకాలం నువ్వు ఏం చేస్తున్నావు? ఈ మధ్య ఎక్కడికైనా వెళ్ళావా? నువ్వు విజయవాడ అప్పుడప్పుడూ వెళ్తావు కదా!? అక్కడ ఇప్పుడు నీ చుట్టాలు ఇంకా వున్నారా?
నువ్వు అమెరికా తప్పకుండా రా. న్యూజెర్సీలో ఇప్పుడు మేం కొత్త ఇల్లు కొనుక్కున్నాం. నువ్వు మాతోనే వుండు.
నీకు తీరిక వున్నప్పుడు ఉత్తరం రాయి.
అక్కడ అందరినీ అడిగానని చెప్పు.
నీ
మిత్రుడు
రవి
Grammar
| No. | Telugu | Definition | Example |
|---|---|---|---|
| 1. | ఎవరైనా | anyone | పార్టీకి మన స్నేహితులు ఎవరైనా వచ్చారా? |
| 2. | ఎక్కడైనా | anywhere | సెలవుల్లో ఎక్కడికైనా వెళ్ళావా? |
| 3. | ఏమైనా | anything | న్యూయార్క్ లో ఏమైనా కొన్నావా? |
| 4. | అనుకుంటున్నాను | to think/to plan | ఇప్పుడు ఏం అనుకుంటున్నారు? |
| 5. | చదవాలనుకుంటున్నాను | planning to study | రేపు ఏం చదవాలనుకుంటున్నావు? |
| 6. | రావాలనుకుంటున్నాను | planning to visit | ఈ ఎండాకాలం ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు? |
| 7. | అప్పుడప్పుడు | now and then | అప్పుడప్పుడు నువ్వు మా ఇంటికి రా. |
Writing Activity
Please use the above words and write a few sentences.
| No. | Telugu | Sentences |
|---|---|---|
| 1. | ఎవరైనా | |
| 2. | ఎక్కడైనా | |
| 3. | ఏమైనా | |
| 4. | అనుకుంటున్నాను | |
| 5. | చదవాలనుకుంటున్నాను | |
| 6. | రావాలనుకుంటున్నాను | |
| 7. | అప్పుడప్పుడు |