4.3 Narrating an Event
Working with Present Narration
Vocabulary Practice
| Telugu | English | Telugu | English |
|---|---|---|---|
| స్నేహితుడు/ స్నేహితురాలు n.m./f. | friend | x వైపు pp. | towards X |
| ఆశ n.f. | hope | వేగంగా adv. | fast |
| విశేషం adj. | special | పరిగెత్తు v.i. | to run |
| కారణం n.m. | reason | కాపాడు v.t. | to save |
| వాపసు adv. | return | ఎత్తు v.t. | to lift |
| గడుపు v.i. | to spend | పారిపోవు v.i. | to run away |
| బయట adj. | out | కాళ్ళు n.m. | leg |
| తిరుగు v.i. | to roam around | ఇరుక్కుపోవు v.t. | to be stuck |
| వెనకటి adj. | last | పడిపోవు v.i. | to fall |
| చెల్లెలు n.f. | paternal uncle’s daughter | పడుv.i. | to lie down |
| పెళ్లి n.f. | marriage | క్షేమంగా adj. | safe |
| సంతోషం adj. | happy | నొప్పి n.f | pain |
| తయారు n.f. | preparation | అనిపించు v.t. | to feel |
| ఘనంగా adj. | grandeur | ఆస్పత్రి n.m. | hospital |
| కొను v.t. | to buy | చేరు v.t. | to arrive/to join |
| మిఠాయి n.m. | an Indian snack | ఎముక n.f. | bone |
| చూడు v.t. | to see | విరిగిపోవు v.i. | break |
| చిన్న adj. | small | చికిత్స చేయు v.t. | to apply a treatment |
| పిల్లాడు n.m. | child | విశ్రాంతి n.f | rest |
| రోడ్డు n.f. | road | సూచించు/సలహా ఇచ్చు v.t. | to instruct |
| దాటు v.t. | to cross | జాగ్రత్త తీసుకొను v.t. | to take care |
Reading
హైదరాబాద్
మే 1, 2024
హెలో సుధీర్,
ఎలా వున్నావు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు హైదరాబాద్ లో ఎక్కడ వుంటున్నావు?
నేను ఈ ఎండాకాలం చివరలో అక్కడికి వద్దామని అనుకుంటున్నాను. నీతో కనీసం రెండు మూడు రోజులు గడపాలని అనుకుంటున్నాను.
ఈ సెమిస్టర్ నేను గ్రాడ్యూయేట్ అవుతున్నాను. అంటే, నా డిగ్రీ వస్తుంది. ఆ తరవాత ఒక సెమిస్టర్ ఆఫ్ తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా చాలా పని చేశాను కదా! కొంచెం విశ్రాంతి తీసుకోవాలని నా ఆశ.
ఈ ఎండాకాలం నేను హైదరబాద్ రావడానికి పెద్ద కారణం- మా చెల్లెలు పెళ్లి అక్కడ జరుగుతోంది. పెళ్లి ఆగస్టులో వుంటుంది. నేనూ, అమ్మా నాన్న కూడా హైదరబాద్ వస్తున్నాం. పది రోజులు అక్కడ వుండి, మళ్ళీ అమెరికాకి వాపసు.
మొన్న నేను మన ఫ్రెండ్ సురేన్ తో మాట్లాడాను. వాడు ఒక వారం నుంచి ఆస్పత్రిలో వున్నాడు. అక్కడ చిన్న ప్రమాదం జరిగిందట. వాడి కాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయని చెప్పాడు. రోడ్డు దాటుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందట. ఒక చిన్న పిల్లాడు సైకిల్ మీద వేగంగా వెళ్తూ, సురేన్ కి అడ్డం వచ్చాడట. ఇంకా వివరాలు నాకు తెలియదు. ఒక వారం రోజులు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వాళ్ళ అమ్మగారు చెప్పారు.
నీకు వీలుంటే, ఒక సారి వాడి దగ్గిరకి వెళ్ళు. ఎలా వుందో చూడు.
వచ్చే వారం మాట్లాడుకుందాం.
నీ
రవి
Writing Activity
Please follow the pattern of the above letter and write a letter to a friend explaining recent activities that are happening around you.
Speaking Activity
Please record a dialog with a classmate or friend, using present tense to share what you’re both doing now.