4.2 Present Negative ఇప్పుడు సినిమా చూడడం లేదు
In this part, we learn about the present negative. As mentioned before, present tense is not just the things you’re doing right now, but also about the things you’ll be doing in the immediate future. Hence, it’s often called a progressive tense.
For instance:
నేను లైబ్రరీకి వెళ్ళడం లేదు. (I’m not going to library.)
The above sentence is not exactly the present tense. It might be also a habitual thing, or it might be about an immediate future.
However, if you specify time, then it might be a present tense or future tense.
- నేను ఇప్పుడు లైబ్రరీకి వెళ్ళడం లేదు. (I’m not going to library now.)
- నేను ఈ సాయంత్రం లైబ్రరీకి వెళ్ళడం లేదు. (I’m not going to library this evening.)
Reading: ఇప్పుడేం చేస్తున్నావు?
| Name | Telugu | English |
|---|---|---|
| వంశీ: | హెలో, సాహితీ! ఎలా వున్నావు? | Hello, Sahiti, how are you? |
| సాహితి: | నేను బాగున్నా. నువ్వు?! | I’m doing well. You? |
| వంశీ: | నేనూ బాగున్నా. నీ సంగతులు చెప్పు. | Me too! Tell me what’s up? |
| సాహితి: | నా సంగతులా?! ఏమీ లేవు. ఇప్పుడు ఏమీ చేయడం లేదు. ఖాళీగానే వున్నా. | For me? Nothing much! I’m not doing anything now. I’m free. |
| వంశీ: | అదేమిటి?! పరీక్షలకు చదవడం లేదా?! | Why is that? Are you not studying for the exams? |
| సాహితి: | ఇవాళ చదవడం లేదు. ఇప్పుడే ఒక ఫ్రెండ్ వచ్చింది. ఇద్దరం బయటికి వెళ్తున్నాం. నువ్వేం చేస్తున్నావు? | Not studying today. Just now a friend came by. We’re going out. What’re you doing? |
| వంశీ: | నాకు రేపు పరీక్ష వుంది. దాని కోసం చదువుతున్నాను. | I’ve got an exam tomorrow. I’m studying for that. |
| సాహితి: | అవునా?! ఈ మధ్య నువ్వు బయట ఎక్కువ కనిపించడం లేదు. | Really?! I don’t see you out that much! |
| వంశీ: | అవును. చాలా పని వుంది. బయటికి అసలు వెళ్ళడం లేదు. | Yes, I have so much work. I’m really not going out. |
| సాహితి: | మరి, ఎక్కువ సేపు రూమ్ లో విసుగు పుట్టడం లేదా? | Then isn’t it boring being glued to the room? |
| వంశీ: | కొంచెం విసుగే! కానీ, పని ని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నా. | Little bit boring! But I started enjoying my work. |
| సాహితి: | బాగుంది, బాగుంది. నేనూ, నా ఫ్రెండ్ ఇప్పుడు రెస్టారంట్ కి వెళ్తున్నాం. | Good, good! I and my friend are going out now to a restaurant. |
| వంశీ: | కానివ్వండి. నేను రూమ్ లో ఏదో మిగిలినవి తింటున్నా. | Oh well! I’m eating some leftovers in the room. |
| సాహితి: | అయ్యో! నీకోసం ఏమైనా తీసుకు వస్తా మరి?! | Oh no! Can I bring something for you then? |
| వంశీ: | వద్దులే! ఇవాళ డిన్నర్ అయిపోయింది కదా! రేపు చూద్దాం. | Don’t worry! I’m done with today’s dinner, right? Let’s see tomorrow. |
Working with Present Negative
Vocabulary Practice
Speaking Activity
Please record a dialog between you and a classmate or friend where you talk about current activities, using both positive and negative forms of the present tense.
Writing Activity
Please use the above details from the speaking activity and write 8 sentences using both positive and negative forms of the present tense.