4.1 Current Activities ఇప్పుడు తెలుగు సినిమా చూస్తున్నాను
In this chapter, we will learn about various activities you’re doing now including the course work. We learn new verbs to share details about our activities.
Present vs. Past Tense
| Verb Stem | Present Tense Marker | Subject Suffix |
|---|---|---|
| చేస్ | తున్నా | ను/రు/డు |
Present Tense Examples
- నేను పనిచేస్తున్నాను. (I am working.)
- వాళ్ళు పనిచేస్తున్నారు. (They’re working.)
- అతను స్కూలుకి వెళ్తున్నాడు. (He is going to school.)
Past Tense Examples
- నేను పనిచేశాను. (I did work.)
- వాళ్ళు పనిచేశారు. (They worked.)
- అతను స్కూలుకి వెళ్ళాడు. (He went to school.)
Writing Activity 1
Please add five more examples here in the present tense. After writing your examples please change your sentences to past tense.
| No. | Examples | Present Tense | Past Tense |
|---|---|---|---|
| 1. | |||
| 2. | |||
| 3. | |||
| 4. | |||
| 5. |
Writing Activity 2
- Please write down a list of various activities that you have started and make a note of their status: complete, incomplete, half done etc.
- Please think about the activities taking place in your parents’ and your friends’ homes and write about them in present tense.
Reading
Context: Ravi and Siri are talking about their current work and activities
| పేరు | Telugu | English |
|---|---|---|
| రవి: | హెలో, సిరీ! ఎలా వున్నావు? | Hello, Siri! How are you? |
| సిరి: | ఓహ్! రవీ! నేను బ్రహ్మాండంగా వున్నాను. నువ్వు?! | Oh! Ravi! I’m fantastic. You? |
| రవి: | నేనా?! పరవాలేదు. | Me? I’m not bad. |
| సిరి: | అదేమిటి? పరవాలేదు అంటున్నావు?! | Why is that? Why are you saying not bad? |
| రవి: | ఆరు రకాల పనులు పెట్టుకున్నాను. రెండే అయ్యాయి. | I took up six different tasks and finished just two. |
| సిరి: | పరవా లేదు లే! ఇప్పుడు ఏం చేస్తున్నావు? | That’s okay! What are you doing now? |
| రవి: | ఒక ప్రాజెక్టు మీద పని చేస్తున్నాను. అది నెమ్మదిగా జరుగుతోంది. | I’m working on a project. It’s going slow. |
| సిరి | అవును, ప్రాజెక్టు పనులు అంత తేలిక కాదు. నేనూ అంతే. చిన్న పనే. కానీ, చాలా సమయం పడుతోంది. | Yes, project tasks are not that easy. It’s the same with me. It’s a small task, but it’s taking so long. |
| రవి: | అదే బాధ! ఒక్కో పని రోజులు రోజులు తీసుకుంటోంది. | That’s the pain! Every task is taking days and days. |
| సిరి : | నీ స్నేహితులు ఇప్పుడు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? | What are your friends doing now? |
| రవి: | అందరూ చాలా తీరిక లేకుండా పని చేస్తున్నారు. శ్రీధర్ వచ్చే ఎండాకాలం జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. సుమ లాసెట్ కి తయారవుతోంది. మోహన్ ఏదో startup కోసం ప్లాన్ చేస్తున్నాడు. | Everyone is working with no free time. Sridhar is trying for a job for next summer. Suma is preparing for the Lawcet. Mohan is planning some startup. |
| సిరి: | అవును, నా ఫ్రెండ్స్ కూడా చాలా బిజీగా వుంటున్నారు. జేన్ రోజూ లైబ్రరీలోనే వుంటోంది. పేపర్ రాస్తోంది. మేరీ గంటలు గంటలు చదువుతోంది. | Yes, all my friends are also very busy. Jane is studying every day in the library. She’s writing a paper. Mary is studying for hours and hours. |
| రవి: | వాళ్ళు అందరూ graduate అవుతున్నారు కదా! చాలా పని. | They’re all graduating, right? It’s lots of work. |
| సిరి: | అవును! నువ్వు రోజూ జాగింగ్ చేస్తున్నావా? | Yes! Are you still jogging every day? |
| రవి: | అయ్యో! లేదు. ఈ వారం వెళ్తున్నాను. నువ్వు?! | Oh, no! I’ll be going this week. You? |
| సిరి: | నేను కొంచెం సేపు యోగా చేస్తున్నాను! అంతే! | I’m doing a little bit of yoga. That’s it! |
| రవి: | ఓహ్! బాగుంది! | Oh, good! |
Speaking Activity
Please record yourself reading the above dialog.