3.4 Formal Conversation: Last Week/Last Month/Last Semester

Working with Formal Conversation

Reading Activity 1

Context: Kiran meets his professor in the office.

కిరణ్: ప్రొఫెసర్ గారూ, నమస్కారమండి!

ప్రొఫెసర్: నమస్తే కిరణ్, ఎలా వున్నావు?

కిరణ్: నేను బాగున్నాను. మీరు?

ప్రొఫెసర్: నేను కూడా బాగున్నాను. పోయిన వారం ఏం చేశావు?

కిరణ్: పోయిన వారం సెలవులు కదా, నేను ఇంటికి వెళ్ళాను. అమ్మానాన్నతో, చెల్లితో గడిపాను. సెలవులలో మీరు ఇక్కడే వున్నారా?

ప్రొఫెసర్: అవును, నేను ఇక్కడే వున్నాను. చాలా పని వుండింది. ఇంట్లో నువ్వు ఏమేం చేశావు?

కిరణ్: అమ్మా నాన్న, చెల్లితో కలిసి ఒక తెలుగు సినిమా చూశాను. సినిమా నాకు నచ్చింది. మీరు కూడా చూడండి.

ప్రొఫెసర్: అవునా?! తప్పకుండా! సినిమాలో ఏం నచ్చింది?

కిరణ్: సినిమా కథ కొత్తగా వుంది. జీవితానికి దగ్గిరగా వుంది.

ప్రొఫెసర్: సంతోషం! ఈ సినిమా గురించి రేపు క్లాసులో మాట్లాడుకుందాం.

కిరణ్: సరే, సరే!

Speaking Activity 1

Record a similar dialog between you and your grandparents/parents.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

Reading Activity 2

Please read this passage about what happened in the last month.

పోయిన నెల ఎండాకాలం సెలవులు. నేను హైదరబాద్ వెళ్ళాను. అక్కడ మూడు వారాలు వున్నాను. హైదరబాద్ లో ఈ సారి చాలా చోట్లకి వెళ్ళాను. గోల్కొండ, చార్ మీనార్, మక్కా మసీదు, బిర్లా టెంపుల్ఇం—కా చాలా.

హైదరబాద్ లో మాకు చాలా మంది చుట్టాలున్నారు. అందరినీ కలవలేదు కానీ, కొందరిని కలిశాను. ఈ సారి విజయవాడ, విశాఖపట్నం కూడా వెళ్ళాను. అక్కడ మా అమ్మ వైపు చుట్టాలు చాలా మంది వున్నారు. వాళ్లందరితో చాలా సరదాగా గడిచింది. రెండు మూడు తెలుగు సినిమాలు కూడా చూశాను. నా స్నేహితులు కొందరు అక్కడ వున్నారు. వాళ్ళందరూ నా వయసు వాళ్లే. వాళ్ళతో కలిసి, బయటికి వెళ్ళడం, రెస్టారంట్స్ లో తినడం, సినిమాలు చూడడం – అంతా సరదాగా గడిచింది.

Writing Activity 1

Write a similar paragraph of 10 sentences about your activities during the last month.

Reading Activity 3

పోయిన సెమిస్టర్ నేను కొంచెం తీరికగా వున్నాను. ఎక్కువ క్లాసులు లేవు. ఎక్కువ పని కూడా లేదు. ఎక్కువ సమయం స్నేహితులతో గడిపాను. ఎండాకాలం సెలవులకు ముందు కుటుంబంతో కలిసి, ఒక సరదా ట్రిప్ కి వెళ్ళాను. ఆ ప్రయాణం నాకు బాగా నచ్చింది. మేం కొన్ని చోట్ల కారులో వెళ్ళాం. కొన్ని చోట్ల రైలులో, ఇంకా కొన్ని చోట్ల బస్సులో వెళ్ళాం. అమ్మానాన్న, చెల్లితో నేను ఎక్కువ సమయం గడిపాను. మామూలుగా సెమిస్టర్ వున్నప్పుడు అంత తీరిక వుండదు. అందుకని, పోయిన సెమిస్టర్ నాకు బాగా నచ్చింది.

Speaking Activity 2

Please record yourself reading the passage above.

If you get an error message when you press the Record button, it may be that your browser does not support this recording device.

Please try again in a browser like Chrome.

Writing Activity 2

Write a similar paragraph of 10 sentences about your last semester activities.

License

Icon for the Creative Commons Attribution-NonCommercial 4.0 International License

Basic Telugu Copyright © 2026 by Afsar Mohammad and Rajiv Ranjan is licensed under a Creative Commons Attribution-NonCommercial 4.0 International License, except where otherwise noted.