2.6 My Family మా కుటుంబం
In this part, we learn about introducing each other’s family members and their activities. We focus on the vocabulary related to family and then use the same vocabulary for various contexts.
Vocabulary Practice
1: Family Members and Relatives
| Telugu | Grammatical Categories | English |
|---|---|---|
| కుటుంబం | n.f | family |
| చుట్టం/బందువు | n.f./m. | relative |
| అమ్మ | n.f. | mother |
| నాన్న | n.m. | father |
| అన్నయ్య | n.m. | brother |
| వదిన | n.f. | brother’s wife |
| చెల్లెలు/చెల్లి | n.f. | sister |
| బావగారు | n.m. | sister’s husband |
| తాతయ్య | n.m. | paternal grandfather |
| నానమ్మ | n.f. | paternal grandmother |
| తాత | n.m. | maternal grandfather |
| అమ్మమ్మ | n.f. | maternal grandmother |
| బాబాయి | n.m. | father’s brother |
| పిన్ని | n.f. | father’s brother’s wife |
| అత్తయ్య | n.f. | father’s sister |
| పెద్దత్తయ్య | n.f. | father’s elder sister |
| మామయ్య | n.m. | mother’s brother |
| అత్తమ్మ | n.f. | mother’s brother’s wife |
| పెద్దమ్మ | n.f. | mother’s elder sister |
| చిన్నమ్మ | n.f. | mother’s younger sister |
| వరసకి అన్నయ్య/చెల్లెలు | n.m./f. | cousin brother-sister |
| మేనల్లుడు | n.m. | nephew |
| మేనకోడలు | n.f. | niece |
| దూరపు చుట్టాలు | n.plural | distant relatives |
| సవతి అన్నయ్య/చెల్లెలు | n.m./f. | half brother/sister |
| పెంపుడు కుక్క/పిల్లి | n.m./f. | pet dog/cat |
2: Family After Marriage పెళ్లి తరవాత
| Telugu | Grammatical Categories | English |
|---|---|---|
| భర్త/ మా ఆయన/వాళ్ళాయన | n.m. | husband |
| భార్య/ మా ఆవిడ/వాళ్ళావిడ | n.f. | wife |
| కొడుకు | n.m. | son |
| కూతురు | n.f. | daughter |
| వదిన | n.f. | daughter-in-law |
| అల్లుడు | n.m. | son-in-law |
| అత్తయ్య | n.f. | mother-in-law |
| మామగారు | n.m. | father-in-law |
| మరిది | n.m. | brother-in-law (from the husband’s point of view) |
| మరదలు | n.f. | sister-in-law (from the husband’s point of view) |
| బావగారు | n.m. | brother-in-law (from the wife’s point of view) |
| ఆడపడుచు | n.f. | wife of a brother-in-law (from the wife’s point of view) |
| ఆడపడుచు | n.f. | sister-in-law (from the wife’s point of view) |
| తోడల్లుడు | n.m. | husband of sister-in-law (from the wife’s point of view) |
Conversation about the Family కుటుంబం గురించి
Context: Ravi and Siri are in the same Telugu class. Their teacher asked them to collect information about each other’s family members. In this reading/listening, they are asking questions of each other.
Pre-reading Activity 1
Please respond to the following questions. Please write your response in Telugu.
| Telugu | English | Your Response in Telugu |
|---|---|---|
| మీ పేరు | your name | |
| మీ నాన్నగారి పేరు | your father’s name | |
| మీ అమ్మగారి పేరు | your mother’s name | |
| మీకు అన్నదమ్ములు ఎంతమంది వున్నారు? | How many brothers do you have? | |
| అన్నదమ్ముల పేర్లు | your brothers’ names | |
| మీకు ఎంతమంది అక్కచెల్లెళ్లు వున్నారు? | How many sisters do you have? | |
| అక్కచెల్లెళ్ల పేర్లు | your sisters’ names | |
| మీ తాతయ్య గారి పేరు | your paternal grandfather’s name | |
| మీ నానమ్మ గారి పేరు | your paternal grandmother’s name | |
| మీ ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులు వున్నాయా? | Do you have any pets? | |
| పెంపుడు జంతువుల పేరు | your pet’s name |
Pre-reading Activity 2
Based on the above information, please draw a family tree.
Reading
Please read the following conversation aloud with a partner (or alone).
| Telugu | English |
|---|---|
| సిరి: నమస్కారం, రవి! ఎలా వున్నారు? | Siri: Hello Ravi! How are you? |
| రవి: నేను బాగున్నాను. ధన్యవాదాలు. మీరు? | Ravi: Hello Siri, I am well, thanks. And you? |
| సిరి: నేను కూడా బాగున్నాను. ధన్యవాదాలు. ఇక పని మొదలు పెడదాం | Siri: I am okay too. Thanks. Let’s get to work. |
| రవి: సరే. చెప్పండి, మీ కుటుంబం ఎక్కడ వుంటుంది? | Ravi: Okay. Please tell me, where does your family live? |
| సిరి: మా కుంటుంబం చికాగోలో వుంటుంది. మీ కుటుంబం? | Siri: My family lives in Chicago. And yours? |
| రవి: మా కుటుంబం కాలిఫోర్నియాలో వుంటుంది. | Ravi: My family lives in California. |
| సిరి: మీ అమ్మగారి పేరేమిటి? | Siri: What is your mother’s name? |
| రవి: మా అమ్మగారి పేరు సౌమ్య. మీ అమ్మగారి పేరు? | Ravi: My mother’s name is Sowmya. What is your mother’s name? |
| సిరి: మా అమ్మగారి పేరు సుశీల. మీ అమ్మగారు ఏం చేస్తారు? | Siri: My mother’s name is Susheela. What does your mother do? |
| రవి: మా అమ్మగారు డాక్టర్. మీ అమ్మగారు? | Ravi: My mother is a doctor. And your mother? |
| సిరి: మా అమ్మగారు ఇంట్లో వుంటారు. గృహిణి. మీ నాన్నగారి పేరేమిటి? | Siri: My mother is a housewife. What is your father’s name? |
| రవి: మా నాన్నగారి పేరు రావు. ఆయన డాక్టర్. మీ నాన్నగారి పేరేమిటి? ఆయన ఏం చేస్తారు? | Ravi: My father’s name is Rao. He is a doctor. What is your father’s name and what does he do? |
| సిరి: మా నాన్నగారి పేరు వినోద్. ఆయన ఇంజినీర్. | Siri: My father’s name is Vinod, and he is an engineer. |
| రవి: మీరు ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? | Ravi: How many brothers and sisters do you have? |
| సిరి: మేం నలుగురం. నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. ఒక చెల్లి వున్నారు. మీరు? | Siri: There are four of us. I’ve an older brother, one younger brother, and a sister. Yourself? |
| రవి: నేను ఒక్కణ్నే! అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు లేరు. | Ravi: I am an only child. I have no brothers and sisters. |
| సిరి: మీ తాతయ్యా, నానమ్మా మీతోనే వుంటారా? | Siri: Do your grandparents live with you? |
| రవి: లేదు. వాళ్ళు వేరే ఇంట్లో వుంటారు. మీ తాతయ్యా, నానమ్మ వాళ్ళు మీతో వుంటారా? | Ravi: No, my grandparents do not live with us. They have their own separate house. Do your grandparents live with you? |
| సిరి: అవును. మేమంతా ఒకే ఇంట్లో వుంటాం. | Siri: Yes, we all live together in the same house. |
| రవి: అవునా?! బాగుంది. సరే, మళ్ళీ కలుద్దాం. | Ravi: Really?! This is a very good thing. Okay, see you later. |
| సిరి: సరే! మళ్ళీ కలుద్దాం. | Shilpa: Okay. Bye. |
Speaking Activity 1
Please record yourself reading the above conversation.
Speaking Activity 2
Following the same model, please record a conversation with a friend or classmate.
Post-Reading Activity 1
Please provide the following information about Ravi and Siri. Please note that some answers may not be available in the text, you can leave those blank.
| ప్రశ్నలు: Questions | రవి | సిరి |
|---|---|---|
| x కుటుంబం ఎక్కడ వుంటుంది? |
|
|
| x వాళ్ళ అమ్మగారి పేరు? |
|
|
| x వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారు? |
|
|
| x వాళ్ళ నాన్నగారి పేరు? |
|
|
| x నాన్నగారు ఏం చేస్తారు? |
|
|
| x కి ఎంతమంది అన్నదమ్ములు? అక్కచెల్లెళ్లు? |
|
|
| x వాళ్ళ అన్నయ్య పేరు? |
|
|
| xవాళ్ళ చెల్లెలు పేరు? |
|
Post-Reading Activity 2
Based on the above reading/speaking, please draw Ravi’s and Siri’s family trees.
Speaking Activity 3
Please record yourself introducing your own family members and using family and kinship terms, in 10-15 sentences.
Interview Activity
Interview your parents about their family members’ names using simple questions: ఏమిటి? (what).
For instance: మా తాతయ్య పేరేమిటి?
Please note that blend (sandhi) in the usage of పేరేమిటి is a combination of two words: పేరు + ఏమిటి.
Native speakers never separate those two words which would sound like: తాతయ్య పేరు ఏమిటి? Almost all questions words in native speech undergo this change.
For instance:
- మీ నాన్నగారి పేరేమిటి? (పేరు + ఏమిటి)
- మీరు అమెరికాలో ఎక్కడుంటారు? (ఎక్కడ + వుంటారు)
- మీ చెల్లి ఇక్కడికి ఎప్పుడొచ్చింది? (ఎప్పుడు + వచ్చింది)
- నిన్న క్లాస్ కి ఎవరొచ్చారు? (ఎవరు+ వచ్చారు)